కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇద్దరు పెన్షన్‌దారులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు. వార్డు వాలంటీర్లు నంద్యాల నుంచి వారి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారు. నంద్యాలలో నడిగడ్డ ప్రాంతానికి చెందిన అస్లాం బాషా అనే వికలాంగుడు తెలంగాణలోని యాదగిరిగుట్టలో ఉంటున్నారు. వాలంటీర్లు అక్కడికి వెళ్లి నాలుగు నెలల పెన్షన్ రూ.12000 అందజేశారు.
నంద్యాల సరస్వతినగర్‌కు చెందిన షేక్ ఆమీర్ రంగారెడ్డి జిల్లా శివరాంపల్లెలో ఉన్నారు. 15వ వార్డుకు చెందిన తిరుమలేష్ బైక్‌పై వెళ్లి ఆమెకు పింఛన్ అందజేశారు. వందల కిలోమీటర్ల దూరం వేర్వేరుగా బైక్‌పై వెళ్లి పింఛన్ అందజేసిన ఆ వాలంటీర్లను పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: