ETV Bharat / state

కన్నవారికి అనారోగ్యం.. బాలికల కొండంత కష్టం

author img

By

Published : Oct 10, 2020, 3:34 PM IST

చిన్నప్పుడే వాళ్ల అమ్మ మతిస్థిమితం కోల్పోయింది. ఇటీవల తండ్రి సైతం పక్షవాతంతో మంచాన పడ్డాడు. అన్నెం పున్నెం ఎరుగని ఆ బాలికల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు కుటుంబ భారమంతా ముగ్గురు ఆడపిల్లలపై పడింది. పొట్టపోసుకోవడానికి చదువులు మానేశారు. కూలీ పనులకు వెళ్తున్నారు. వచ్చిన కాస్తంత సంపాదనతో తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకుంటూ, జీవనం సాగిస్తున్నారు. అంతులేని కష్టాలకు ఎదురీదుతూ బతుకు వెళ్లదీస్తున్నారు.

parents illness is very difficult for girls
బాలికల జీవనం దుర్భరం

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం మాధవరానికి చెందిన బీటీ శ్రీనివాసులు, నాగమ్మ దంపతులకు భాగ్యలక్ష్మి, రాజశ్రీ, నవిత సంతానం. ఆ ముగ్గురు బాల్యంలోనే.. తల్లి నాగమ్మ మతి స్థిమితం కోల్పోయింది.పెద్ద కుమార్తె.. తన చెల్లెళ్ల చూసుకోవడానికి బడి మానేసింది. తండ్రి శ్రీనివాసులు పిల్లల బాగోగులు చూసుకుంటూ తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసేవాడు.

కరోనా లాక్ డౌన్ తో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇంతలో.. వారి తండ్రి శ్రీనివాసులు పక్షవాతానికి గురై మంచం పట్టాడు. భారమంతా ఆడపిల్లలపైనే పడింది. చదువుకోవాలనే ఆశ ఉన్నా.. విధి లేక కూలీకి వెళ్తున్నారు. ఆ కాస్త సంపాదనతో జీవనమే భారం కాగా.. తల్లిదండ్రులకు వైద్యం చేయించలేని పరిస్థితి నెలకొంది. వారికి వైద్యం చేయించాలని దాతలను కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలులో క్యాన్సర్​ అవగాహన ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.