కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాల కోసం అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడం లేదు. మార్కెట్కు వచ్చే వారు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో వలస వెళ్లి తిరిగి వచ్చిన వారిని గ్రామస్థులు అడ్డుకోగా... వైద్యం కోసం ఆదోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
ఇదీ చదవండి.