కర్నూలు జిల్లా నంద్యాలలో బొగ్గు లైను ప్రాంతంలో నిర్మితమవుతున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెప్టిక్ ట్యాంకుకు రంగు వేస్తున్న ఇద్దరు కూలీలు అస్వస్థతకు గురై అక్కడే పడి పోయారు. ఇది గమనించిన నీటి సరఫరా నిర్వాహకుడు ప్రతాప్, సెక్యూరిటీ గార్డు కేశాలు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా రక్షించారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వీరిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రతాప్ మృతి చెందాడు.
ఇదీ చూడండి: