A boy missing at nandyal: కర్నూలు జిల్లా నంద్యాలలో ఒకటిన్నర సంవత్సరాల బాలుడు అదృశ్యమయ్యాడు. నంద్యాల పట్టణ శివారు వైఎస్ నగర్ సమీపంలోని బుడగ జంగాల కాలనీకి చెందిన దంపతులు లక్ష్మీదేవి, దుర్గాప్రసాద్. వీళ్ల ఒకటిన్నర ఏళ్ల బాలుడు రాఘవ. ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన రాఘవ.. కనిపించకుండాపోయాడని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి..
CBN On Statue Issue: కులాల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదు: చంద్రబాబు