కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ప్రవహిస్తుండటంతో అక్కడ నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవాదాయశాఖ కార్యదర్శి ఈ నెల 22న ఆదేశాలు జారీచేశారు. పుష్కర స్నానానికి అనుమతి లేకపోయినప్పటికీ నది ఒడ్డున, అక్కడి ఆలయాల వద్ద పిండ ప్రదానం వంటి వైదిక కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. నది ఒడ్డున ఉండే ఆలయాల్లో దర్శనాలకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కొవిడ్ నేపథ్యంలో పుష్కర స్నానాలు వద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో.. దీనిపై పునఃపరిశీలన చేయాలంటూ దేవాదాయశాఖ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ప్రభుత్వం అనుమతిస్తే.. సామూహికంగా కాకుండా, ఆన్‌లైన్‌లో టైమ్‌స్లాట్ బుకింగ్ ద్వారా నిర్దిష్ట సమయంలో స్నానాలకు అనుమతించేలా కర్నూలు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
తుంగభద్రలో పుష్కర స్నానానికి అనుమతి లేదు
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా నదిలో స్నానానికి అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని పేర్కొంది.