ETV Bharat / state

Yuvagalam: చేనేత వ్యవస్థను ప్రక్షాళన చేసి సమస్యల్ని పరిష్కారిస్తాం: లోకేశ్​ - నారా లోకేశ్ యువగళం పాదయాత్ర

Lokesh Yuva Galam Padayatra: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీల పరిధిలో ఖాళీగా ఉన్న బంజరు భూముల్లో గొర్రెల పెంపకానికి హక్కులు కల్పిస్తామని నారా లోకేశ్​ హామీ ఇచ్చారు. 86వ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగించారు.

Lokesh Yuva Galam Padayatra
Lokesh Yuva Galam Padayatra
author img

By

Published : May 2, 2023, 7:11 AM IST

చేనేత వ్యవస్థను ప్రక్షాళన చేసి సమస్యల్ని పరిష్కారిస్తాం: లోకేశ్​

Lokesh Yuva Galam Padayatra: తెలుగుదేశం అధికారంలోకి రాగానే చేనేత వ్యవస్థను ప్రక్షాళన చేసి సమస్యలన్నింటినీ పరిష్కారిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. 86వ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగించిన యువనేత..టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గోనెగండ్లలో 11 వందల కిలోమీటర్ల మైలురాయిని పాదయాత్ర చేరుకోవడంతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 86వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు విడిది కేంద్రం నుంచి యాత్ర ప్రారంభించగా.. అడుగడుగున స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. గోనెగండ్ల రోడ్డులోని ఏడు మోరీల వద్ద గొర్రె కాపరులను పలకరించిన యువనేత వారి కష్టాలను తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీల పరిధిలో ఖాళీగా ఉన్న బంజరు భూముల్లో గొర్రెల పెంపకానికి హక్కులు కల్పిస్తామన్నారు. సబ్సిడీ సహా ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపరులకు 10 లక్షల బీమా ఇస్తామన్నారు..

"కార్పొరేట్​ బ్యాంకుల్లో వన్​ టైమ్​ సెటిల్​మెంట్​ చేయమని మీరు అడుగుతున్నారు కాబట్టి మొత్తం ఎంత ఉందో అన్ని వివరాలు కనుక్కొని దానిపైనా నేను స్పందిస్తాను. టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తాం. చేనేత సోదరులను నేను దత్తత తీసుకుంటాం. మొత్తం వ్యవస్థనే ప్రక్షాళన చేస్తాం. చేనేతలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యతను తెలుగుదేశం తీసుకుంటుంది"-నారా లోకేశ్​, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

రాళ్లదొడ్డిలో చేనేత కార్మికులతో సమావేశమైన లోకేశ్...చేనేత రంగాన్ని దెబ్బతీస్తున్న జీఎస్టీ రద్దుకు వైకాపా ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల్ని దత్తత తీసుకుని వ్యవస్థ మెుత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

కడిమెట్ల శివారులో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను లోకేశ్‌ పరిశీలించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతింటే ప్రభుత్వం తరఫున పట్టించునే నాథుడే కరవయ్యాడని మండిపడ్డారు. ఏ రైతును కదిలించినా కష్టాలు, కన్నీళ్లే సమాధానంగా వస్తున్నాయని నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత వద్దకు వచ్చి కనీస పలకరించలేని ప్రభుత్వ పాలకులు ఎందుకని నిలదీశారు.

గోనెగండ్ల చేరుకోగానే లోకేశ్ పాదయాత్ర 1100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని లోకేశ్‌ ఆవిష్కరించారు. 87 వ రోజైన నేడు గాజులదిన్నె విడిది కేంద్రం నుంచి ప్రారంభమయ్యే లోకేశ్ పాదయాత్ర ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో కొనసాగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.