ETV Bharat / state

yuvagalam @ 100 days: చెంచులతో లోకేశ్​ సమావేశం.. గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్​కు హామీ - లోకేశ్ వందో రోజు పాదయాత్ర పై వైసీపీ

100th Day Yuvagalam Padayatra: నారా లోకేశ్ పాదయాత్ర ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ.. వంద రోజుల మైలురాయిని చేరుకుంది. లోకేశ్‌ వందోరోజు పాదయాత్రలో ఆయన తల్లి నారా భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ యాత్రలో చెంచులతో సమావేశమైన లోకేశ్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Nara Lokesh Mother Bhuvaneshwari in  Yuvagalam
నారా లోకేశ్ యువగళం
author img

By

Published : May 15, 2023, 10:37 PM IST

వంద రోజులు పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర

Nara Lokesh Yuvagalam @ 100 Days: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వందో రోజు ఉత్సాహం సాగింది. నంద్యాల జిల్లా మోతుకూరులో వంద రోజుల పైలాన్‌ను లోకేశ్‌ ఆవిష్కరించారు. వందో రోజు తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు. చెంచులతో ప్రత్యేకంగా సమావేశమైన లోకేశ్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి పక్కా గృహాలు నిర్మించడమేగాక, ఉపాధి హామీ పథకం అమలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నో అడ్డంకులను దాటుకుని లోకేశ్ పాదయాత్ర వంద రోజుల మైలురాయిని చేరుకున్నాడు. పాదయాత్రతో లోకేశ్.. యువతను ఆకట్టుకుంటూ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. వైకాపా నేతల అవినీతిని బట్టబయలు చేస్తూ లోకేశ్​ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒక్క అడుగుతో మొదలైన ప్రయాణం మైళ్లకొద్దీ సాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను అత్యవసర సందర్భాలు మినహా విరామం లేకుండా కొనసాగిస్తున్నారు. వందో రోజు లోకేశ్‌తోపాటు ఆయన తల్లి నారా భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు యాత్రలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మోతుకూరులో వంద రోజుల పాదయాత్ర పైలాన్‌ను నారా లోకేశ్ ఆవిష్కరించారు.

నంద్యాల జిల్లా సంతజూటూరులో చెంచులతో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం అమలు చేయడం లేదని చెంచులు తెలపగా.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని లోకేశ్ పేర్కొన్నాడు. చెంచులకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. చెంచులకు భూములు పంచడమేగాక... ప్రత్యేక పంటలు పండించేలా ప్రోత్సహించి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ తెలిపారు. అడవిలోకి స్వేచ్ఛగా వెళ్లే హక్కు కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. చెంచుగూడెంలో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.

ఐటీడీఏ ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలను చెంచులకు అందజేస్తామని నారా లోకేశ్ వెల్లడించారు. గిరిజనులు తయారుచేసే ఉత్పత్తులు రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి ప్రత్యేక అవుట్ లెట్స్ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తామని లోకేశ్ తెలిపారు. ఏకో టూరిజం ఏర్పాటు చేసి గిరిజనులు, చెంచులకి ప్రయోజనాలు కలిగేలా చేస్తామన్నారు. ఆర్డీటి లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని చెంచులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని లోకేశ్ వెల్లడించారు. భూములు కేటాయించి పట్టాలు ఇస్తామని, వ్యవసాయం కోసం బోర్లు వెయ్యడం సహా సోలార్ మోటార్లు బిగిస్తామని, బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామని లోకేశ్ చెంచులకు హామీ ఇచ్చారు.

100వ రోజు లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందు నడిచారు. పాదయాత్ర అనంతరం.. యువగళం వాలంటీర్లు, టీమ్‌ సభ్యులకు నారా భువనేశ్వరి స్వయంగా భోజనం వడ్డించి వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.