కర్నూలు జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ నిర్వాసితులకు వెంటనే రూ.రెండు కోట్లు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రిజర్వాయర్ నిర్మాణానికి 46 మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. వీరికి సరైన పరిహారం అందకపోవడంతో నంద్యాల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
గత 15 సంవత్సరాలుగా ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. నంద్యాల న్యాయస్థానం, సివిల్ న్యాయమూర్తి కె. శివశంకర్ సోమవారం 46 మంది రైతులకు రెండు కోట్ల రూపాయలు పరిహారం సీఎంఎఫ్ఎస్ ద్వారా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని తీర్పు వెలువరించారు. తీర్పుతో 15 ఏళ్ల రైతుల ఎదురు చూపులు నేటికి ఫలించాయి.
ఇదీ చదవండి: కొండలరాయుడి చెంతకు.. పసిడి యువకుడు!