ఆదివారం త్రినేత్ర మోహన్ రెడ్డి పట్టణ శివార్లలోని స్టేడియం వద్దకు మార్నింగ్ వాక్కు వెళ్తుండగా వెనకవైపు నుంచి బొలెరో వాహనంలో వచ్చిన కొందరు అతడిపై కర్రలతో దాడి చేశారు. స్టేడియంలో ఉన్న క్రీడాకారులు ఈ విషయం తెలుసుకుని అతని రక్షించేందుకు పరిగెత్తుకొని రావడం చూసిన నిందితులు అదే వాహనంలో పారిపోయారు. గాయపడిన మోహన్‌రెడ్డిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మోహన్‌రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కారు పార్కింగ్ విషయంలో ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో కొన్ని రోజుల క్రితం వాగ్వాదం జరిగిందని, ఈ గొడవల కారణంగానే ఏవీ అనుచరులు తనపై దాడి చేశారని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏవీ సుబ్బారెడ్డి అనుచరుడు కొండారెడ్డితోపాటు మరో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని.. ఎస్సై రామిరెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: సోమవారం నుంచి రైతుల రిలే నిరాహార దీక్షలు