ETV Bharat / state

పుర పోరు: జిల్లాలో ఎన్ని స్థానాల్లో ఎన్నికలంటే..?

పుర పోరుకు ఎస్ఈసీ పచ్చజెండా ఊపడంతో కర్నూలు జిల్లా అధికారులు ఎన్నికల ఏర్పాట్ల కోసం సన్నద్ధమవుతున్నారు. మార్చి 10న జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థతో పాటు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ పురపాలక సంఘాలు, నగర పంచాయతీ అయిన గూడూరుకు ఎన్నికలు జరగనున్నాయి.

ap municipal elections 2021
ap municipal elections 2021
author img

By

Published : Feb 16, 2021, 10:18 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం పుర పోరుకు పచ్చజెండా ఊపింది. ఉదయం నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పురపాలక ఎన్నికలు కరోనాతో అదే నెల 15న వాయిదా పడ్డాయి. అప్పటివరకు కొందరు నామినేషన్లు అందజేశారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఎక్కడ ఆగిందో నామినేషన్ల పర్వం అక్కడి నుంచి అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 2, 3 తేదీల్లో నామపత్రాల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదేరోజు బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు. మార్చి 10న జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థతో పాటు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ పురపాలక సంఘాలు, నగర పంచాయతీ అయిన గూడూరుకు ఎన్నికలు జరగనున్నాయి. 14న ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

పురపాలిక ఎన్నికలకు లైజనింగ్‌, పర్యవేక్షక అధికారులను నియమిస్తూ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కార్పొరేషన్‌కు లైజనింగ్‌ అధికారిగా జి.గోపి, పర్యవేక్షణాధికారి యు.వెంకటరామయ్య నియమితులయ్యారు. మిగిలిన ఏడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీకి లైజనింగ్‌ అధికారిగా సీహెచ్‌ రాజేష్‌, పర్యవేక్షణాధికారిగా సాయికిరణ్‌ను నియమించారు.

కచ్చితంగా ఏడాది తర్వాత.. పుర పోరు కరోనాతో నిలిచి ఏడాది అవుతోంది. కర్నూలు కార్పొరేషన్‌కు 11 ఏళ్ల తర్వాత ఎన్నికల పండగొచ్చింది. పాలకవర్గం లేక కొన్నేళ్లుగా నగరంలో సమస్యలు తిష్ట వేశాయి. నగరంలో 52 వార్డులున్నాయి. వీటిలో కల్లూరు పరిధిలో 16, కోడుమూరు పరిధిలో 3, కర్నూలు పరిధిలో 33 వార్డులున్నాయి. నగరపాలక సంస్థ అయ్యాక తొలి మేయర్‌గా బంగి అనంతయ్య నిలిచి, జాతీయ స్థాయిలో సత్కారాలు అందుకున్నారు.

నామపత్రాలు ఇచ్చారిలా..:

జిల్లాలో తొమ్మిది పురపాలక సంఘాల్లో 302 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులకు మొత్తం 2,061 నామపత్రాలు దాఖలయ్యాయి. తిరస్కరణ రోజున వీటిలో 149 తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో కొన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం నామపత్రాల ఉపసంహరణ పర్వం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.ఓ ఎమ్మెల్యే తన పార్టీ కార్యాలయంలో రెండు రోజుల క్రితం మెప్మాకు చెందిన బుక్‌కీపర్లు, వీవోఏలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో కార్పొరేటర్లను గెలిపించే బాధ్యత మీదేనని, ఓట్లు వేయించాలని హుకుం జారీ చేశారు.

డోన్‌లో ఎన్నికలు బహిష్కరించిన తెదేపా

డోన్‌లో 32 వార్డులకు 130 నామపత్రాలు అందాయి. అందులో ఐదు తిరస్కరణకు గురవ్వగా 125 నామినేషన్లు ఆమోద ముద్ర వేసుకున్నాయి. వార్డుల్లో 74 నామినేషన్లు వైకాపా, తెదేపా 13, పది భాజపా, సీపీఐ 7, జనసేన 2, ఆర్పీఐ(ఏ) 1, స్వతంత్రులు 18 మంది ఉన్నారు. ఇక్కడ తెదేపాకు చెందిన 18 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ అడ్డుకోవడం, పోలీసులతో బెదిరింపులకు పాల్పడటం, అర్ధరాత్రి వేళ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల తలుపులు తట్టడం వంటి కారణాలతో పురపాలక ఎన్నికలను బహిష్కరించామంటూ కేఈ సోదరులు గతంలో ప్రకటించారు. ప్రస్తుతం పుర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలతో అడుగులు వేస్తారనేది ఆసక్తిగా మారింది. నామినేషన్ల పర్వం మొదటి నుంచి ప్రారంభించాలని తెదేపా ఇప్పటికే ఈసీని కోరింది.

ఇదీ చదవండి

గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే ఎన్నిక వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.