ETV Bharat / state

స్వచ్ఛ కర్నూలు దిశగా...నగరపాలక సంస్థ అధికారుల అడుగులు

స్వచ్ఛ కర్నూలు నగరాన్ని తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు నడుంబిగించారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తా, చెదారం శుభ్రం చేయాలంటూ ప్లాట్ల యజమానులకు తాఖీదులు జారీ చేస్తున్నారు. పట్టించుకోని యజమానుల స్థలాలను నగరపాలక సిబ్బందే శుభ్రం చేసి...నిర్వహణ ఖర్చులను చలానా రూపంలో పంపిస్తున్నారు.

author img

By

Published : Jan 24, 2021, 6:41 PM IST

స్వచ్ఛ కర్నూలు దిశగా...నగరపాలక సంస్థ అధికారుల అడుగులు
స్వచ్ఛ కర్నూలు దిశగా...నగరపాలక సంస్థ అధికారుల అడుగులు

భవిష్యత్ అవసరాల కోసం స్థలాలు కొనుగోలు చేసి ఖాళీగా వదిలేస్తూ ఉంటారు. అలాంటి స్థలాలకు చుట్టూ ప్రహరీ లేకపోవడంతో స్థానికులు అక్కడ చెత్తా చెందారం వేయడం వల్ల అపరిశుభ్రంగా తయారవుతాయి. దీనివల్ల దోమలు పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇలాంటి ఖాళీ స్థలాలపై కర్నూలు నగరపాలక సంస్థ దృష్టి సారించింది. నగరవ్యాప్తంగా సుమారు 2వేల ఖాళీ స్థలాలు ఉండొచ్చని అంచనా వేసిన అధికారులు...వాటిని శుభ్రం చేయాల్సిందిగా పలు దఫాలుగా యజమానులకు నోటీసులు ఇచ్చారు. చాలావరకు యజమానులు స్పందించకపోవడంతో....ఖాళీ స్థలాల్లో చెత్తను తొలగించే బృహత్ కార్యానికి అధికారులు శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థ జేసీబీలు ట్రాక్టర్లతో చెత్తను పురపాలక సిబ్బందే తొలగించారు. దీనికి ఛార్జీలు వసూలు చేస్తూ...స్థల యజమానులకు చలానా రూపంలో పంపుతున్నారు.

నగరపాలక సంస్థ తీరును కొందరు స్వాగతిస్తుండగా....ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. కనీసం మురుగునీటి కాల్వలు శుభ్రం చేయని సిబ్బంది.....ఖాళీ స్థలాల్లో చెత్తా, చెదారం ఉందంటూ వేల రూపాయలు చలానాలు విధించడమేంటని మండిపడుతున్నారు. కొన్ని కాలనీల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన నగరపాలకసంస్థ...మిగిలిన ప్రాంతాలపైనా దృష్టిసారించనున్నారు. ఖాళీ స్థలాలకు రక్షణ గోడ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. పిచ్చిమొక్కలు, చెత్తా చెదారం తొలగించకుంటే...తామే తొలగించి ఛార్జీ వసూలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఎస్వీ కళాశాల పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో.. గవర్నర్ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.