కర్నూలు జిల్లా డోన్ లో తారకరామా నగర్ కు చెందిన ఓ గృహిణీ, తన నలుగురి పిల్లలతో సహా ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. రోజు తాగే టీ లో తలలోని పేలను చంపెందుకు వాడే రసాయనాన్ని కలిపి, వరలక్ష్మి తన పిల్లలకు ఇచ్చింది. తరువాత తను సేవించింది. అందరు అపస్మారకస్థితికి చేరుకోగా, స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరలక్ష్మి మృతి చెందగా, నలుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: ఇసుమంతైనా కనికరం లేదా.. ఆ అమ్మకు?