కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన లావణ్య అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్యకు దేవనకొండ గ్రామానికి చెందిన గంగిరెడ్డితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ మధ్యకాలంలో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు పంచాయితీలు నిర్వహించినా గొడవలకు పరిష్కారం లభించలేదని స్థానికులంటున్నారు. ఈ కలహాలతో మనస్తాపానికి గురైన లావణ్య చిన్న కూతురు నిక్షిత(3)తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను తీశారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మద్దికెర ఏఎస్ఐ కృష్ణయ్య కేసు నమోదు చేసారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇది చూడండి: రూ.10 కోట్ల పారితోషికం వదులుకున్న నయన్