ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద దామోదర్ మోదీ కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ రంగనాథ స్వామివారిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ప్రహ్లాద వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట భాజపా నేత, నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి ఉన్నారు. ఆయన రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి...