కర్నూలులోని స్వామి రెడ్డి నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అగ్ని ప్రమాదం జరిగి.. మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న మరో మూడు గుడిసెలకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల విలువ చేసే బంగారు వస్తువులతో పాటు నగదు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. సమాచారం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి ఆర్థిక సహయంతో పాటు.. వస్తువులను అందజేశారు.
ఇదీ చదవండి: