తెదేపా అధినేత చంద్రబాబును అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించిన మంత్రులు బొత్స, బుగ్గనను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన ఐటీ సోదాల్లో వేలకోట్లు బయటపడ్డాయని ఆరోపణలు చేసిన మంత్రులు... ఆదాయ పన్ను శాఖ పంచనామా చూసి నోరు మెదపటం లేదని ఎద్దేవా చేశారు. రుజువులు లేకుండా ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధిపై జగన్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం, సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదన్నారు. తొలగించిన రేషన్ కార్డులు, పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు.
ఇదీచదవండి