కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ దర్శించుకున్నారు. మంత్రికి వైకాపా నాయకులు ప్రదీప్ రెడ్డి, భీమిరెడ్డి కలిసి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూల బృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు మంత్రికి మంత్రాక్షితలు చిత్రపటం అందజేసి ఆశీర్వదించారు.
ఇవీ చూడండి...