పెళ్లిపీటల మీద వధూవరులు చూడముచ్చటగా ఉన్నారు. కానీ ఆ ముచ్చట కొద్దిసేపు కూడా నిలవలేదు. అసలు ఏమి జరిగిందోనని అందరు ఒకటే టెన్షన్... ఏమీ తెలియని అమాయకుడిలాగా... చేతిలో తాళిబొట్టుతో రెడీగా ఉన్న ఆ పెళ్లికొడుకు బండారం ఒక్కసారిగా బయటపడింది. పెళ్లి వేడుక ...కాస్తా రచ్చబండగా మారింది.ఈ ఘటన కర్నూలులో జరిగింది.
పెళ్లి కాస్తా పెటాకులు
తిరుపతికి చెందిన మోహనకృష్ణ అనే వ్యక్తితో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ యువతికి పెళ్లి కుదిరింది. స్థానిక మహానందీశ్వర స్వామి ఆలయంలో వివాహం జరుగుతుండగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన కొంతమంది అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఇదివరకే తమ అమ్మాయితో వివాహం కుదుర్చుకొని 12 లక్షల రూపాయల కట్నం సైతం తీసుకున్నట్లు తెలిపారు. తమ డబ్బుల వ్యవహారం తేల్చాక... వివాహం చేసుకోవాలని ఆందోళన చేశారు. ఊహించని ఘటనతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.
కట్నం కింద ఇద్దరి యువతులతో ...12 లక్షలు పైగా స్వాహా
ఒకదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా... ఒకరితో నిశ్చితార్థం,మరోకరితో వివాహం కోసం...ఇద్దరి వద్ద మెుత్తం 24 లక్షలు కట్నం తీసుకున్నాడు. యువకుడి మోసం తెలిసి పోయింది. నిశ్చితార్థం కుదుర్చకున్న అమ్మాయి తరుపు వారు, పెళ్లికూతురు తరపు వారు....పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.... పెళ్ళికొడుకు మోహన్ కృష్ణ, అతని అన్నను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తీవ్ర ఆవేదన
శుభకార్యం తలపెట్టిన వేళ, బయటపడిన మోసంతో అమ్మాయి కుటుంబం వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
ఇవీ చదవండి