MURDER: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో దారుణం జరిగింది. పొలం తగాదా విషయంలో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన సంచలనం రేపింది. గ్రామానికి చెందిన గాండ్ల కిట్టు (48) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన బలిజ గోపాల్, ఆయన ఇద్దరు కుమారులు కలిసి గడ్డపారలు, రాడ్లతో కొట్టి చంపారు. ఉదయం బహిర్భూమికి వెళ్తున్న గాండ్ల కిట్టును నిందితులు హత్య చేశారు. అనంతరం పోలీస్స్టేషన్ వెళ్లి లొంగిపోయారు.
పొలం తగాదాలపై.. మృతుడు కోర్టుకు వెళ్లగా అతనికే చెందుతున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పొలం విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి: