కర్నూలు నగరంలో లాక్డౌన్ ఆంక్షల విషయంలో స్వల్ప మార్పులు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ తెలిపారు. గతంలో అన్ని రకాల దుకాణాలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు అనుమతి ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమయాన్ని పొడిగించినట్లు స్పష్టం చేశారు.
ఔషధ దుకాణాలు, ఆసుపత్రులకు సడలింపులు ఇచ్చారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని... మాస్కులు తప్పనిసరిగా ధరించాలని గుర్తు చేశారు. ఒక వ్యక్తి మొదటిసారి మాస్కు లేకుండా కనపడితే రూ. 200, అదే వ్యక్తి రెండోసారి మాస్కు లేకుండా కనబడితే రూ. 500 జరిమానా విధిస్తామన్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ వివరించారు.
ఇవీ చదవండి...