కర్నూలులో లాక్డౌన్ను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఉదయం 11 గంటలు దాటిన తరువాత రహదారులపైకి వచ్చేవారి వివరాలను ఆరా తీస్తున్నారు. సరైన కారణం చెప్పకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్ల వద్దే ఉండే ప్రభుత్వానికి సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
నగరంలోని అమ్మవారిశాల వద్ద మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు శ్రీనివాసులు వివరించారు.
ఇదీ చదవండి: నంద్యాలలో పటిష్టంగా లాక్డౌన్.. ఇంటి వద్దకే నిత్యావసర సరకులు