తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉన్న కర్నూలు జిల్లాలో ఎన్నికల కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, డబ్బు జిల్లాలోకి రాకుండా చూసేందుకు జిల్లా నలుమూలల 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కడప, అనంతపురం జిల్లాలను సైతం సరిహద్దులుగా కలిగి ఉండటంతో జిల్లా సరిహద్దుల వద్ద 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. వాహన రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వీటిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు..
ఇవీ చూడండి...: రహదారి కోసం ఎన్నికలు బహిష్కరించిన గ్రామం