తుంగభద్ర దిగువ కాలువ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి జీవనాడి. ఈ కాలువ కింద ఖరీఫ్, రబీ సీజన్లలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కానీ ప్రధాన కాలువ పలుచోట్ల శిథిలావస్థకు చేరడంతో కొన్నేళ్లుగా కేటాయించిన నీరు ఆయకట్టుకు చేరడం లేదు. స్థిరీకరించిన ఆయకట్టులో సగం వరకు నీరందడం లేదు. రూ.37 కోట్లతో ప్రభుత్వం ఎమ్మిగనూరు వద్ద ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులను చేపట్టింది. 6 కిలోమీటర్ల మేర కాలువ గట్లకు ఇరువైపులా రాతి గోడలు నిర్మించి... మధ్యలో సీసీ లైనింగ్ వేస్తున్నారు. దశాబ్దాల క్రితం తవ్విన ఈ కాలువ ఆధునికీకరణ పనులతో పటిష్ఠంగా మారనుంది.
తుంగభద్ర దిగువ కాలువకు మరమ్మతులు
తుంగభద్ర దిగువ కాలువ కింద ఖరీఫ్, రబీ సీజన్లలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కానీ కాలువ పలుచోట్ల శిథిలావస్థకు చేరడంతో కేటాయించిన నీరు ఆయకట్టుకు చేరడం లేదు.
తుంగభద్ర దిగువ కాలువ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి జీవనాడి. ఈ కాలువ కింద ఖరీఫ్, రబీ సీజన్లలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కానీ ప్రధాన కాలువ పలుచోట్ల శిథిలావస్థకు చేరడంతో కొన్నేళ్లుగా కేటాయించిన నీరు ఆయకట్టుకు చేరడం లేదు. స్థిరీకరించిన ఆయకట్టులో సగం వరకు నీరందడం లేదు. రూ.37 కోట్లతో ప్రభుత్వం ఎమ్మిగనూరు వద్ద ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులను చేపట్టింది. 6 కిలోమీటర్ల మేర కాలువ గట్లకు ఇరువైపులా రాతి గోడలు నిర్మించి... మధ్యలో సీసీ లైనింగ్ వేస్తున్నారు. దశాబ్దాల క్రితం తవ్విన ఈ కాలువ ఆధునికీకరణ పనులతో పటిష్ఠంగా మారనుంది.
Body:తుంగభద్ర దిగువ కాలువ
Conclusion:ఆధునికీకరణ పనులు