ETV Bharat / state

'మహిళల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటాం' - ప్రత్యేక సహాయ కేంద్రం తాజా సమాచారం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో మహిళల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రారంభించారు. స్త్రీలకు ఏ సమస్య వచ్చినా.. ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Launch of Special Helpline for Women at Allagadda Urban Police Station, Kurnool District
'మహిళా భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటాం'
author img

By

Published : Jan 27, 2021, 9:07 AM IST

మహిళల కోసం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర ప్రారంభించారు. స్త్రీల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు.. ఇటువంటి సహాయ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతున్నాయని చెప్పారు.

మహిళలకు ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా సహాయక కేంద్రాల వద్ద ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తమ సమస్యలను ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటిని సకాలంలో పరిష్కరిస్తామని అన్నారు. ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతను మహిళా పోలీసులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రైతు సమస్యలపై గళమెత్తితే కేసులా ?: మాజీమంత్రి అఖిల ప్రియ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.