ETV Bharat / state

పంచలింగాల చెక్​పోస్టు వద్ద తనిఖీలు.. ఆభరణాలు, వజ్రాలు స్వాధీనం - పంచలింగాల చెక్ పోస్ట్

Ornaments Seized: పంచలింగాల చెక్​పోస్టు వద్ద భారీగా ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. వీటిని తరలిస్తున్న రాజస్థాన్​కు చెందిన కపిల్​ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

seized gold at panchalingala checkpost
seized gold at panchalingala checkpost
author img

By

Published : Feb 28, 2022, 11:47 AM IST

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రాజస్థాన్​కు చెందిన కపిల్ అనే యువకుడు బంగారు ఆభరణాలు వజ్రాలు తీసుకొని వెళుతుండగా అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 840 గ్రాముల బంగారు ఆభరణాలు 57 వజ్రాలు గుర్తించారు.

ఆభరణాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో.. వాటిని స్వాధీనం చేసుకొని కపిల్​ను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సెబ్ సీఐ మంజుల తెలిపారు.

ఇదీ చదవండి

తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్​.. పుతిన్‌ అంచనాలు తప్పాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.