ETV Bharat / state

హైవే దోపిడి.. ఇద్దరు నిందితుల అరెస్ట్ - దారిదోపిడీని ఛేదించిన కర్నూలు పోలీసులు

కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై ఈ నెల 5న జరిగిన దారి దోపిడీని పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.

దారిదోపిడీని ఛేదించిన కర్నూలు పోలీసులు
author img

By

Published : Sep 12, 2019, 10:17 PM IST

దారిదోపిడీని ఛేదించిన కర్నూలు పోలీసులు

కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై ఈ నెల 5న దోపిడీ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఉపయోగించిన స్విఫ్ట్ కారు, చోరీ చేసిన 3 చరవాణులు, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

5వ తేదీ రాత్రి 12.30 గంటలకు వెల్దుర్తి జాతీయ రహదారిపై సూదేపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ కారును, స్విఫ్ట్ కారులో ఏడుగురు వ్యక్తులు వెంబడించారు. సూదేపల్లి స్టేజ్ వద్దకు రాగానే ముందున్న కారును ప్లాన్ ప్రకారం స్విఫ్ట్ ​కారు ఢీకొట్టింది. ముందు కారులోని వ్యక్తులు దిగి, ప్రశ్నిస్తుండగా.. దుండగులు వారిపై దాడి చేసి రూ.10 వేల నగదు, 3 చరవాణులు అపహరించారు.

ఈ ఘటనపై బాధితులు 6వ తేదీన వెల్దుర్తి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురి కోసం గాలింపు జరుగుతోందని డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. నిందితులను హైదరాబాద్​కు చెందినవారిగా గుర్తించి.. కోర్టులో హాజపరిచారు.

ఇదీ చదవండి:

అన్నదమ్ముల మధ్య.. పొలం పంపకం చిచ్చు

Intro:ఉదయగిరిలో వైభవంగా రొట్టెల పండుగ

Body:నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో రొట్టెల పండుగను ప్రజలు వైభవంగా నిర్వహించుకున్నారు. నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ జరిగే సందర్భంలో ఉదయగిరి లో కూడా రొట్టెల పండుగను ప్రతియేటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. స్థానిక పెద్ద చెరువులో పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి గుంటల్లో రొట్టెలను మార్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయగిరి తో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పెద్ద చెరువు ప్రాంగణానికి చేరుకొని సంతానము, ఉద్యోగము, వివాహము, వ్యాపారము రొట్టెలను పట్టుకున్నారు. అనంతరం చెరువు సమీపంలోని గంజా షాహిద్ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రొట్టెలను వదిలేందుకు వచ్చిన ప్రజలతో పెద్ద చెరువు ప్రాంగణం రద్దీగా మారింది.

Conclusion:రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ నెంబర్ : 8008573944
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.