విద్యార్థులకు గోరుముద్దలు పెట్టిన కర్నూలు ఎమ్మెల్యే
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కొత్తపేటలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాధమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకం అమలు విధానాన్ని పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. తన చేతులతో కొంతమంది విద్యార్థులకు ఎమ్మెల్యే గోరుముద్దలు తినిపించారు. అన్ని రకాల పోషక విలువలు అందేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని... క్షేత్రస్థాయిలో అమలు విధానం బాగుందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
పాటశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు ఎమ్మెల్యే
By
Published : Feb 4, 2020, 5:00 PM IST
పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్