ETV Bharat / state

'పుష్కరాలను కరోనాకు సూపర్‌ స్ప్రెడర్‌గా మార్చొద్దు' - Kurnool District latest news

గుంపులు గుంపులుగా ఒక్కచోటకు చేరితే మనకు మనంగానే తుంగభద్ర పుష్కరాలను కరోనా వైరస్‌కు సూపర్‌ స్ప్రెడర్‌గా మార్చే అవకాశం ఉందని.. అందుకే ఈ-టికెట్ విధానం తీసుకువచ్చామని పర్యవేక్షణ అధికారి, కర్నూలు జిల్లా జేసీ-2 రాంసుందర్‌రెడ్డి 'ఈనాడు-ఈటీవీభారత్' ముఖాముఖిలో తెలిపారు. 12 ఏళ్లలోపు, 60 ఏళ్లపైబడిన వారికి అనుమతి లేదన్నారు. దీర్ఘకాలిక సమస్యలైన బీపీ, షుగర్, గుండె శస్త్రచికిత్సలతో బాధపడుతున్న భక్తులు రాకూడదని కోరారు. ఈ-టికెట్ బుకింగ్ చేసుకుని వచ్చే భక్తులు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. సంబంధిత వెబ్‌సైట్​ను త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతున్న జేసీ-2తో మాప్రతినిధి సురేంద్ర ముఖాముఖి.

Kurnool JC Interview over Tungabhadra Pushkaralu
రాంసుందర్‌రెడ్డి
author img

By

Published : Oct 21, 2020, 5:26 PM IST

ప్రశ్న: ఈ-టికెట్ విధానం తీరుతెన్నులు ఏంటి..?
జవాబు: కొవిడ్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ-టికెట్ విధానం తీసుకొచ్చాం. ప్రత్యేక వెబ్‌సైట్ అభివృద్ధి చేసి పుష్కరాలకు పది రోజులకు ముందే అందుబాటులోకి తెస్తాం. తుంగభద్ర నదిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఘాట్‌ల వివరాలను పొందుపరుస్తాం.

ప్రశ్న: బుకింగ్ చేసుకున్న వారికి ఏదైన ప్రత్యేక సమయం కేటాయిస్తారా..?
జవాబు: ప్రతి ఘాట్‌లో 15 నిమిషాల టైం స్లాట్ కేటాయిస్తాం. భక్తునికి భక్తునికి ఆరు అడుగుల దూరం తప్పనిసరి చేస్తున్నాం. ఘాట్ పొడవును దృష్టిలో పెట్టుకుని ప్రతి స్లాట్‌లో 20 మందికి పుణ్యస్నానాలకు అనుమతిస్తాం. పుష్కరాల్లో పిండ ప్రదానం చేసేవారికి 15 నిమిషాలు సరిపోదు కనుక 30 నిమిషాల టైం స్లాట్ కేటాయిస్తున్నాం.

ప్రశ్న: ఈ-టికెట్ బుకింగ్ చేశాక ఎంత సేపటికి సమాచారం భక్తులకు అందుతుంది..?
జవాబు: ఈ-టికెట్ బుకింగ్ ఎవరైతే చేసుకుంటారో ఆ కుటుంబ సభ్యుల పేర్లు, స్లాట్ వివరాలతో చరవాణికి వెంటనే సందేశం వెళుతుంది. సొంతంగానైనా, రాష్ట్రంలో ఉన్న గ్రామ సచివాలల్లోనైనా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.

ప్రశ్న: కొవిడ్ నిబంధనల మేరకు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు..?
జవాబు: బస్సులు, కార్లకు కేటాయించిన పార్కింగ్‌ స్థలాల నుంచే కొవిడ్ నిబంధనలు అమలు చేస్తాం. భౌతికదూరం పాటిస్తూ మాస్క్‌ ధరించాలి, మాస్క్‌ లేనిదే పుణ్యస్నానానికి అనుమతి లేదు. స్లాట్‌లో ప్రకారం ఒక విడత 20 మంది స్నానాలు ఆచరించి వెళ్లగానే ఆ ఘాట్‌ను శానిటైజ్ చేస్తాం. ఆ తరువాత మరో బ్యాచ్‌కు అవకాశం కల్పిస్తాం.

ప్రశ్న: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఈ-టికెట్ విధానంపై ముందస్తుగా ఎలాంటి అవగాహన కలిగిస్తారు..?
జవాబు: జిల్లాలో జరిగే తుంగభద్ర పుష్కరాలకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. కనుక జిల్లా పౌరసంబంధాల శాఖ ద్వారా తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, ఇంగ్లీషుల్లో సమాచారం ముందస్తుగా ఆయా రాష్ట్రాలకు పంపుతున్నారు.

ప్రశ్న: ఘాట్‌ల రూట్ మ్యాప్‌ ఏమైనా వెబ్​సైట్‌లో పొందుపరుస్తున్నారా..?
జవాబు: వెబ్​సైట్‌లో ప్రధమంగా ఎంచుకోవాల్సిన ఘాట్‌లు, ఏ స్టేషన్‌ నుంచి బస్సులు అక్కడికి వెళతాయి, ఎంత సమయం పడుతుంది, కర్నూలు నగరానికి ఆ ఘాట్‌ దూరం ఎంత.. ఇలా ప్రతి అంశాన్ని తెలిపేల సమాచారం ఉంచుతాం. ప్రైవేటు వాహనాల్లో
వచ్చేవారికి గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఘాట్‌కు చేరుకునే సదుపాయం కల్పిస్తాం.

ఇదీ చదవండి:

కొనసాగుతున్న అల్పపీడనం... విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.