కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ అర్ధరాత్రి పాణ్యంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల వద్దకు చేరుకున్న కలెక్టరు గేటు నుండి సిబ్బందిని పిలిచారు. ఎవరూ రాకాపోవడంతో దాదాపు గంటపాటు గేటు వద్దే వేచి ఉన్నారు. కలెక్టర్ వెంట ఉన్న అధికారులు గోడ దూకి విచారించగా.. విద్యార్థులు మాత్రమే ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం గేటు తాళాలు పగలగొట్టి వసతి గృహంలోకి వెళ్లారు. పాఠశాల తరగతి గదులు, సౌకర్యాలు పరిశీలించారు. బల్లల కింద నిద్రిస్తున్న విద్యార్ధులను గమనించారు. ప్రిన్సిపల్ అక్కడికి చేరుకోవడంతో పాఠశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎవరూ లేకుండా విద్యార్థులను అలాగే వదలివెళ్లడంపై కలెక్టర్ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి 'ఆఖరి నిమిషంలో ఆపడం మంచిదైంది'