ETV Bharat / state

సమరాంధ్ర @ 2019.. ఓటు చైతన్యంలో అగ్ర'హారమే'!

చదువుకున్నవారిలో.. పట్టణాల్లో నివసిస్తున్న వారిలో.. కొందరు ఎన్నికలంటే తక్కువగా ఆలోచిస్తారు. ఆ రోజులు ఓ సెలవుదినంగా భావిస్తుంటారు. కానీ... నాలుగువందలకు మించని ఓటర్లు ఉన్న ఓ కుగ్రామంలోని ప్రజలు ఇందుకు భిన్నంగా నడుచుకుంటున్నారు. ప్రతిసారి 100 శాతం పోలింగ్ శాతం సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

author img

By

Published : Mar 29, 2019, 7:14 PM IST

100శాతం పోలింగ్ సాధిస్తుఆదర్శంగా నిలుస్తోన్న అగ్రహారం గ్రామం

కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండల పరిధిలోని జె.అగ్రహారంచిన్న ఊరు. ఉండేది కేవలం 392 మంది ఓటర్లు. అయినా... ఓటుచైతన్యంతో తమ కుగ్రామాన్ని ఆదర్శంగా నిలిపారు. ప్రతిసారి100 శాతం ఓటింగ్ సాధిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఊళ్లో గొడవలుండవు, పోలీసు కేసులుండవు, మద్యం దుకాణాలూ ఉండవు. ఎటువంటి సమస్య అయినా ఐకమత్యంగా పరిష్కరించుకుంటారు.దేశంలో ఏ మూలన ఉన్నా ఎన్నికల సమయానికి ఊరికి చేరుకుంటారు. పోటీలో ఉన్నవారిలోనచ్చిన నాయకుడికి కచ్చితంగా ఓటేస్తారు. పోలింగ్ రోజును ఓ పండగలా భావిస్తారు. ఆనవాయితీని కొనసాగిస్తూ... ఈసారీ 100 శాతం ఓటింగ్ సాధిస్తామని స్పష్టం చేస్తున్నారు గ్రామస్తులు.

గ్రామ చైతన్యానికి బీజం పడింది అప్పుడే...

గ్రామం ఇంతలాచైతన్యవంతం కావడానికి 2 దశాబ్ధాల క్రితమే బీజం పడింది. అప్పట్లో గ్రామాన్ని పట్టిపీడిస్తున్న సారా మహమ్మారిని తరిమేందుకు గ్రామంలోని మహిళలు ఏకమయ్యారు. ఈనాడు ఆధ్వర్యంలో బృందంగా ఏర్పడి ఊళ్లోకి సారా ప్రవాహాన్ని అడ్డుకున్నారు. నాటి నుంచీ అదే స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆదర్శ గ్రామంగా అగ్రహారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.

ఇవీ చూడండి.

డోన్​లో ఓటుపై 'ఈనాడు - ఈటీవీ' అవగాహన

Intro:వినూత్న రీతిలో తెదేపా ప్రచారం. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి హరికృష్ణ వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకుంటూ ప్రచారం నిర్వహించారు. బస్సులోని ప్రయాణికులకు కరపత్రాలు అందించి ఆశీర్వదించాలి అంటూ వేడుకున్నారు.

Body:ప్రచారంలో భాగంగా పచ్చికాపల్లం లో మహిళలకు సహాయంగా చింతపండు కొడుతూ, ఫలహారశాల లో పూరీ రుద్దుతూ ఓట్లను అభ్యర్థించారు. ఎండవేడిమి లెక్కచేయకుండా కార్యకర్తలతో కలసి కరపత్రాలు పెంచుతూ గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు.

Conclusion:మహేంద్ర etv bharat జీడీ నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.