కర్నూలులో ఎక్కువ మంది కరోనా బాధితులను ఒకే అంబులెన్సులో తరలించారన్న ఈటీవీ - ఈటీవీ భారత్ కథనంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య, అంబులెన్స్ మేనేజర్ శివకృష్ణతో కమిటీ వేశారు. తక్షణం విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే కొత్తగా జిల్లాకు 50 అంబులెన్సులు వచ్చాయని మండలానికి ఒకటి చొప్పున అంబులెన్సులు ఉన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే వాహనంలో ఇంతమందిని తరలించడంపై కలెక్టర్ సైతం ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ జరిగింది..
కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాల్లో కరోనా బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ఒకే అంబులెన్స్‌ను వినియోగించారు. ఎక్కేందుకు స్థలం లేకపోయినా అందులోనే ఇరికించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై ఈటీవీ - ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన కలెక్టర్ చర్యలు చేపట్టేలా కమిటీని నియమించారు.
ఇదీ చూడండి:
కరోనా రోగుల అంబులెన్స్... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్