కరోనా విపత్తు సమయంలో ప్రతి ఒక్క ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని కర్నూలు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ డీకే. బాలాజీ అన్నారు. ఆయన నగరంలో పర్యటించి.... పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
బ్లీచింగ్ పౌడర్, హైపో ద్రావణం పిచికారీ చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని స్థానిక ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులకు ఆయన మెమోలు జారీ చేశారు. 3 రోజుల్లోగా రాత పూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.