ETV Bharat / state

అందంగా ముస్తాబవుతున్న కర్నూలు నగరం - kurnool city news

అభివృద్ధిలో భాగంగా నగరాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తుంగభద్ర పుష్కరాల సమయంలో కర్నూలు నగరాన్ని సుందరీకరించాలని నిధులు మంజూరు చేశారు. ఆ సమయంలో మిగిలిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. ఇదివరకటి కంటే నగరం ఆకర్షణీయంగా ఉందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

kurnool city
కర్నూలు నగరం
author img

By

Published : Dec 27, 2020, 10:38 AM IST

Updated : Dec 27, 2020, 12:23 PM IST

కర్నూలు నగరం కొత్త అందాలను సంతరించుకుంటోంది. నగరంలోని పలు కూడళ్లు చూడచక్కగా ముస్తాబవుతున్నాయి. గోడలపై వర్ణ చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తుంగభద్ర పుష్కరాల నిధులతో..నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.

తుంగభద్ర పుష్కరాల సమయంలో రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును అందంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1.90 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. పుష్కరాలు సమీపిస్తున్నవేళ నిధులు రావటంతో... పలు సుందరీకరణ పనులు ఆలస్యం అయ్యాయి.

పుష్కరాలకు ముందు కేవలం స్వాగత తోరణాలు సహా కొన్ని అత్యవసర పనులు మాత్రమే చేపట్టారు. మిగిలిపోయిన పనులన్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. విహార్, ఐదురోడ్లు, కిడ్స్ వరల్డ్, రైల్వేస్టేషన్ సమీపంలోని కూడళ్లలో ఏర్పాటు చేసిన వివిధ కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. జలమండలి, బళ్లారి చౌరస్తా, పంప్ హౌస్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గోడలపై వేసిన వర్ణచిత్రాలు ఔరా అనిపిస్తున్నాయి. పచ్చదనంలో భాగంగా... డివైడర్ల మధ్యలో నాటిన వివిధ రకాల మొక్కలు కనువిందు చేస్తున్నాయి.

"నగరాన్ని అందంగా ముస్తాబు చేసేందుకు మున్సిపల్​ సిబ్బంది చాలా కృషి చేస్తున్నారు. ప్రతి రోడ్డుని శుభ్రంగా, పచ్చదనంతో ఉంచటమే కాక.. లైటింగ్​ ఏర్పాటు చేశారు. అడవిలోని జంతువుల మాదిరి కూడళ్లలో ఏర్పాటు చేసిన బొమ్మలు చూడ ముచ్చటగా ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించే విధంగా రహదారి మధ్యలో కొత్త మొక్కలు నాటారు. అభివృద్ధిలో భాగంగా..నగరాన్ని సుందరీకరిస్తున్నందుకు ఎమ్మెల్యే హఫీజ్​, మున్సిపల్​ కమిషనర్​కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం" -నగరవాసి

అభివృద్ధి బాటలో కర్నూలు నగరం

ఇది వరకు రోడ్లు చెత్తగా ఉండేవి. ఎమ్మెల్యే, అధికారులు కలిసి రహదారులు, వాటి వెంట గోడలను పేంటింగ్స్​తో​ సుందరంగా చేస్తున్నారని నగర వాసులు అంటున్నారు. ఆర్​ఎస్​ రోడ్​, కలెక్టర్​ ఆఫీస్​, బళ్లారి చౌరస్తా, ఎస్​బీఐ సర్కిల్​ ఈ ప్రాంతాలు అప్పటితో పోల్చితే ఇప్పుడు బాగున్నాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

'నంద్యాల కూరగాయల మార్కెట్​ను అభివృద్ధి చేస్తాం'

Last Updated : Dec 27, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.