కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందు నదిపై వంతెన ప్రమాదకరంగా మారింది. ఇటీవల తరుచూ వచ్చిన భారీ వరదల కారణంగా వంతెన మునిగిపోయింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరింది.
రాకపోకలకు వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. నదిలో దిగి జలదీక్ష కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: