ETV Bharat / state

వరద పరవళ్లు... నిండు కుండలా జలాశయాలు - heavy flood water

నైరుతి రుతుపవన ప్రభావంతో కురుస్తోన్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

కృష్ణమ్మలో వరద పరవళ్లు... నిండు కుండలా జలాశయాలు
author img

By

Published : Aug 3, 2019, 3:56 PM IST

కృష్ణమ్మలో వరద పరవళ్లు... నిండు కుండలా జలాశయాలు

కృష్ణానది... భారీ వరదతో పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పొటెత్తింది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాయి. ఆల్మట్టి జలాశయానికి వరద భారీగా కొనసాగుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1705 అడుగులకు గాను.. ప్రస్తుతం 1700.49 అడుగులు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలకు గాను.. 106.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 2 లక్షల 22 వేలకు క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 2 లక్షల 39 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

నారాయణపూర్.. నిండుగా

ఆల్మట్టి నుంచి వరద నారాయణపూర్ చేరుతుంది. నారాయణ పూర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1615 అడుగులు కాగా... ప్రస్తుతం 1610.24 అడుగుల నీరు నిండింది. నారాయణపూర్ నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా... ఇప్పటికే 31.27 టీఎంసీల నీటితో జలకళను సంతరించుకుంది. జలాశయానికి 2 లక్షల 22 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 2 లక్షల 27 వేల890 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

జూరాలకూ వరద

నారాయణ పూర్ నుంచి జూరాల జలాశయానికి వరద క్రమంగా పెరుగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1044.52 అడుగులు చేరింది. 9.66 టీఎంసీలు సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో...ప్రస్తుత నీటి 9.36 టీఎంసీలకు చేరింది. జూరాలకు వస్తున్న ఇన్‌ఫ్లో 2 లక్షల 9 వేల క్యూసెక్కులను.. దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి లక్షా 98 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలయానికి చేరుతుంది.

శ్రీశైలంలో వరద పరవళ్లు

శ్రీశైలం పూర్థిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను.. ఇప్పటికే 845.60 అడుగులకు నీరు చేరింది. 215.81 టీఎంసీల సామర్థ్యమున్న శ్రీశైలం ప్రాజెక్టులో... ప్రస్తుతం 71.28 టీఎంసీల నీరు నిల్వఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

తుంగభద్రకు ఇన్​ఫ్లో

తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర నిల్వసామర్థ్యం100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్రకు 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.

ఇదీ చదవండి : వరదతో పోలవరానికి ఇబ్బంది లేదు: ఈఈ శ్రీనివాస్

Intro:ap_vzm_38_19_bhaggu_manna_bhanudu_avb_c9 గతంలో లో ఉన్నడు చూడని విధంగా ఎండలు మండిపోతున్నాయి భానుడు భగ్గుమన్న డంతో జనం విలవిలలాడుతున్నారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో లో ఎండలు మండిపోతున్నాయి గతంలో ఎన్నడు నమోదు కాని విధంగా ఉష్ణోగ్రతలు లో నమోదు అవుతున్నాయి గత రెండు రోజులుగా 45 46 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మధ్యాహ్నం పూట ఎండకి తోడు వేడి గాలి తోడవడంతో పాదచారులు ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు 10 గంటలు దాటాక బయటికి రావాలంటే భయపడుతున్నారు మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రోడ్లపై జన సంచారం తగ్గిపోతుంది అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వచ్చేందుకు సాహసించడం లేదు అప్పుడు కూడా గొడుగు లు తువాలు టోపీలు రక్షణ సాధనాల ధరించి వస్తున్నారు గతేడాది 44 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత గా ఈ ప్రాంతంలో నమోదుకాగా ఈ ఏడాది 40 డిగ్రీల కు కు చేరింది ఈ పరిస్థితి ఇ మరింత పెరగకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అధికారులు సూచిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో లో పెరిగిన కాలుష్యం తగ్గిన పచ్చదనం కారణంగా ఉష్ణోగ్రత పెరుగు తుందని అని అంటున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.