కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన కేంద్ర బృందం కర్నూలుకు చేరుకుంది. స్థానిక ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లోని అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ కె.ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి, నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె. బాలాజీ తదితరులను కేంద్ర బృంద సభ్యులైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.మధుమిత దూబే, ప్రొఫెసర్ డా.సంజయ్ సాదుఖాన్లు మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనా కట్టడిపై కంటైన్మెంట్ క్లస్టర్ల వారీగా తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందం ఆదివారం నుంచి 6 రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది.
ఇదీ చదవండి..