కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంత రైతులకు కిసాన్ రైలు సౌకర్యం కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ పండే పంట ఉత్పత్తులను అన్నదాతలు ఈ రైలు ద్వారా ఇతర ప్రాంతాలను తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. పంట పండిన ప్రాంతంలో ధర ఆశాజనకంగా లేకపోతే వేరే ప్రాంతాల్లో గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చు. రైతులు ముందుకొస్తే రైలు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఉద్యాన పంటలకు రవాణా ఖర్చులో 50 శాతం రాయితీ ఉందని చెప్పారు.
జిల్లాలో ఉల్లి, బీన్స్, క్యారెట్, వంకాయ, పచ్చిమిర్చి రవాణా చేసేందుకు అధికారులు పచ్చజెండా ఊపారు. రవాణా వ్యయంలో 50 శాతం రాయితీ ఇస్తామని అధికారులు చెప్పారు. దిల్లీ, ఛండీఘర్, జైపుర్, చెన్నై, భువనేశ్వర్, హౌరా, నాగర్ కోయిల్, విశాఖ తదితర ప్రాంతాలకు పంట ఉత్పత్తులు చేరవేసేందుకు రైలు సదుపాయం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..
కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. ప్రాజెక్టుల్లో 99 శాతం నీటి నిల్వ