కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సొగనూరు రహదారిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా... 84 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని గుర్తించారు. మద్యం ప్యాకెట్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న నిందితులు ఎమ్మిగనూరు మండలంలోని ఎస్. నాగలాపురంకు చెందిన వారని సీఐ మహేశ్వర రెడ్డి చెప్పారు.
ఇవీ చదవండి: వేతనాలు చెల్లించాలని రోడ్డెక్కిన ప్రైవేటు ఉపాధ్యాయులు