ETV Bharat / state

Journalists Agitation: పాత్రికేయులపై దాడి చేసిన ఎంపీ అనుచరులను కఠినంగా శిక్షించాలి: జర్నలిస్టులు

author img

By

Published : May 22, 2023, 4:56 PM IST

Kadapa YSRCP MP Avinash Reddy followers attacked on Journalists: మే 19వ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు మీడియా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, విలేకర్లు ధర్నాకు దిగారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కలెక్టర్లకు వినతిపత్రాలను అందజేశారు.

MP Avinash
MP Avinash

Kadapa YSRCP MP Avinash Reddy followers attacked journalists news: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప జిల్లా వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు.. ఈ నెల 19వ తేదీన పాత్రికేయులపై దాడి చేసి.. వారి కెమెరాలను, వాహనాలను ధ్వంసం చేశారు. ఆ ఘటనపై ఆగ్రహించిన పాత్రికేయులు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి.. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో వినతిపత్రాలను అందజేశారు. అనంతరం పాత్రికేయ ప్రతినిధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మీడియా ప్రతినిధులపై దాడి.. ఈ నెల 19వ తేదీన అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు వివేక హత్య కేసులో విచారించేందుకు విచ్చేయడంతో.. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ప్రసారం చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై కడప జిల్లా వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసి.. మీడియా వాహనాల్ని ధ్వంసం చేశారు. మరోసారి నిన్న రాత్రి కర్నూలు జిల్లాలోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద అవినాష్​ అనుచరులు వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడటమే కాకుండా ఆస్పత్రి వద్దకు జర్నలిస్టులు వస్తే చంపేస్తామంటూ బెదిరించారు. అంతేకాదు, ఈరోజు కూడా విశ్వభారతి ఆస్పత్రి వద్ద మీడియా ప్రతినిధులపై దాడి చేసి, పలు కెమెరాలను ధ్వంసం చేశారు. దాడి సమయంలో అక్కడే ఉన్న పోలీసులు.. విలేకరులపై అవినాష్ అనుచరులు దాడి చేస్తుంటే.. మౌనం వహించారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనల్ని తీవ్రంగా ఖండిస్తూ.. పాత్రికేయ సంఘాలు నేడు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

కర్నూలు జిల్లాలో ధర్నా.. విలేకర్లపై అవినాష్ రెడ్డి అనుచరులు చేసిన దాడిని నిరసిస్తూ.. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా సంఘాలు, విలేకరులు ధర్నా చేపట్టారు. ధర్నాలో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్టు చేసి, పాత్రికేయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి, ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులకు మద్దతుగా సీపీఐ, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. జర్నలిస్టులపై దాడులు చేస్తుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

జర్నలిస్టులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి.. మరోవైపు జర్నలిస్టులపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో APUWJ అధ్వర్యంలో పాత్రికేయుులు ఆందోళన చేపట్టారు. దాడులకు పాల్పడంతో పాటు సాక్ష్యాల్ని ధ్వంసం చేయడానికి యత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ మాధవిలత, ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. విలేకర్లపై దాడుల్ని అరికట్టే విధంగా చేసిన తీర్మానాన్ని అధికారులకు సమర్పించారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునారావృతం కాకుండా చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

మన్యం జిల్లాలో జర్నలిస్టులు నిరసన.. విధి నిర్వహణలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సిబ్బందిపై దాడిని నిరసిస్తూ.. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో కలెక్టర్ నిశాంత్ కుమార్​కి వినతిపత్రం అందించారు. పాత్రికేయులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

జర్నలిస్టుల కోసం ప్రత్యేక చట్టం అమలు చేయాలి.. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన అవినాష్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలంటూ అనంతపురం జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు, సీపీఐ, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని సంఘమే సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గౌతమికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొంతమంది జర్నలిస్టులపై సీఐడి కేసులు నమోదు చేసి, బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు.

ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులు వినూత్న నిరసన.. వివేక హత్య కేసుకు సంబంధించి.. విచారణ నిమిత్తం కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ కోర్టుకి హాజరయ్యే విషయంలో వీడియోలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయడానికి ఖండిస్తూ.. ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద జర్నలిస్టులు వినూత్నంగా నిరసన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. అవినాష్ రెడ్డి అనుచరులు జర్నలిస్టులపై గూండాల్లాగా దాడి చేసి, గాయపరచడమే కాక వారి కెమెరాలను, వాహనాలను ధ్వంసం చేయడానికి ఖండిస్తూ.. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.