ETV Bharat / state

కుటుంబం ఆత్మహత్య ఘటన.. దర్యాప్తు వేగవంతం - Kurnool crime news

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపులు తాళలేమంటూ.. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌... డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లను ఆదేశించారు. దర్యాప్తు వేగవంతం చేసిన ఐపీఎస్ అధికారుల కమిటీ.. నంద్యాల వన్‌టౌన్‌ సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ను బాధ్యులుగా గుర్తించి అరెస్ట్‌ చేసింది.

Inquiry going on Family suicide in Nandyal
కుటుంబం ఆత్మహత్య ఘటన.. దర్యాప్తు వేగవంతం
author img

By

Published : Nov 9, 2020, 5:34 AM IST

కుటుంబం ఆత్మహత్య ఘటన.. దర్యాప్తు వేగవంతం

పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి... అబ్దుల్‌ సలాం కుటుంబం రైలు కిందపడి చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి, హోంమంత్రి సుచరిత విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సుచరిత కర్నూలు రేంజ్ డీఐజీని ఆదేశించారు. లోతైన దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను నియమించారు. ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అదనపు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజలకు విచారణ బాధ్యత అప్పగించారు. దర్యాప్తు వేగవంతం చేసిన విచారణ కమిటీ... ఈ కేసులో బాధ్యులుగా ఉన్న నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను అరెస్ట్‌ చేసింది.

అబ్దుల్‌ సలాం కేసులో బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన అధికారులు... దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వేధించడం, బాధించడం, మారణాయుధాలు చూపి.. లేదా ఆ తరహాలో బెదిరించడం, ఆత్మహత్యకు పురికొల్పడం వంటి సెక్షన్లు ఇందులో ఉన్నట్లు విచారణ అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో విచారణ పూర్తిచేస్తామన్నారు. ఆటోలో నగదు పోయినట్లు ఫిర్యాదు చేసిన భాస్కర్‌రెడ్డిని పోలీసులు విచారించారు.

నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం ఓ బంగారు దుకాణంలో పనిచేసేవారు. ఏడాది కిందట దుకాణంలో చోరీ జరగగా.... సలామే చేశాడని యజమాని ఫిర్యాదు చేశారు. పోలీసులు సలాంను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన సలాం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాజాగా... ఆటోలో 70 వేల నగదు చోరీకి గురైందని పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సలాం నడిపే ఆటోలోనే దొంగతనం జరిగిందని పోలీసులు అతన్ని మరోసారి స్టేషన్‌కు పిలిపించారు.

అయితే.. చోరీలతో సంబంధం లేకపోయినా ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని.... వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని... అబ్దుల్ సలాం కుటుంబం సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత పాణ్యం మండలం కౌలూరు వద్ద రైలు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సెల్ఫీ వీడియో శుక్రవారం వెలుగుచూసింది. ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనార్టీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అబ్దుల్ సలాం కేసులో బాధ్యులుగా గుర్తించిన సోమశేఖర్‌రెడ్డి, గంగాధర్‌ను కోర్టులో హాజరు పరచి రిమాండ్​కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండీ... నంద్యాల ఘటనపై సీఎం జగన్ సీరియస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.