కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కళాశాల స్థలాన్ని ఇంఛార్జ్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పరిశీలించారు. ఆదోని-ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన నాగలాపురం గ్రామ పరిధిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించి పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 31న సీఎం జగన్ దీనికి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. 59.45 ఎకరాల విస్తీర్ణంలో రూ. 475 కోట్లతో ఆదోని ప్రభుత్వ మెడికల్ కళాశాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి. Inhumanity: తల్లిని ఇంట్లోకి రానివ్వని కుమారులు!