ETV Bharat / state

భావితరాల కోసం కలగన్నారు.. సంఘటితమై సాధించారు

Womens day special : వారంతా నిరుపేద మహిళలు.. నిరక్షరాస్యులు.. కూలినాలీ చేసుకుంటూ జీవనం సాగించే సాధారణ పల్లె జీవులు. తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో.. రూపాయి రూపాయి కూడబెట్టి.. ఇటుకలు పేర్చి.. అద్భుతమైన పాఠశాలను నిర్మించుకున్నారు. తమ పిల్లలతో పాటు వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఆ మహిళలు సాధించిన విజయం గురించి తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 8, 2023, 11:58 AM IST

మహిళలు తీర్చిదిద్దిన విద్యానిలయం

Womens day special : రెండు దశాబ్దాల కిందటి వరకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు తాండవించేవి. నాడు చంద్రబాబు పెట్టిన డ్వాక్రా సంఘాల్లో చేరిన మహిళలు... రూపాయి రూపాయి పొదుపు చేసుకుంటూ.. గ్రామైక్య సంఘాలు, మండల సమాఖ్య ఏర్పాటు చేసుకుని తమ జీవితాలకు చక్కటి బాట వేసుకున్నారు. మొదట్లో బాల కార్మికుల కోసం భవిత పాఠశాలను ఏర్పాటు చేసి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించారు. అనంతరం బాల భారతి పాఠశాలను ప్రారంభించారు. దీనికి మంచి భవనం ఉండాలన్న ఉద్దేశంతో 2006లో ఏడెకరాల స్థలం సేకరించి పునాది రాయి వేశారు. డబ్బులు లేక కొంత కాలం పనులు ఆగిపోయాయి. మహిళలంతా కలిసి రూపాయి, రూపాయి సేకరించి శ్రమదానం చేశారు. సుమారు 7 కోట్ల రూపాయలతో అద్భుతమైన భవనాన్ని నిర్మించారు. 2017 నాటికి దీనిని పూర్తి చేసి అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించుకున్నారు.

వెయ్యి సంఘాలు.. ఓర్వకల్లు మండలంలో వెయ్యి పొదుపు సంఘాలు ఉన్నాయి. మొత్తం పది వేల మంది మహిళలు, వారి కుటుంబ సభ్యుల శ్రమ ఫలితంగా ఈ భవనాన్ని పూర్తి చేశారు. నాలుగు అంతస్థుల ఈ భవనంలో ప్రస్తుతం 7 వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు. కార్పొరేట్ విద్యను తలదన్నేలా ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన చదువును అందిస్తున్నారు. 31 మంది ఉన్నత విద్యావంతులు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. పది మందికిపై పైగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అతి తక్కువ ఫీజులతో ఇక్కడి పిల్లలు చదువుకుంటున్నారు. తల్లి లేదా తండ్రి లేని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. సుమారు వంద మందికిపైగా చిన్నారులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. 9 బస్సులు 27 గ్రామాలకు తిరిగి పిల్లలను బడికి చేర్చుతున్నాయి. ఏటా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఆటపాటల్లోనూ చిన్నారులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు.

ఈ పాఠశాలకు ఏ ఒక్కరూ యజమాని కాదు. పది వేల మంది పొదుపు మహిళలూ యజమానులే. పాఠశాలకు సంబంధించిన ఏ నిర్ణయం అయినా వీరు ఎన్నుకున్న కమిటీనే తీసుకుంటుంది. కమిటీ ఆధ్వర్యంలోనే పాఠశాల పని చేస్తుంది. దీనిని మరింత అభివృద్ధి చేయాలని మహిళలు చెబుతున్నారు.

ఆడపిల్లల చదువుకు ఆటంకాలున్నాయని గమనించాం. మే ఎలాగో చదువుకోలేదు.. మా పిల్లలకు చదువు తప్పనిసరి అని గమనించాం. అప్పటికే పత్తి మిల్లుల్లో పని చేస్తూ.. స్కూలుకు వెళ్లలేని ఆడపిల్లల కోసం భవిత పాఠశాలను ఏర్పాటు చేశాం. వారు చదువుకున్న తీరు.. ఫస్ట్ క్లాస్ మార్కులు చూసి అశ్చర్యపోయాం. అప్పుడే బాల భారతి పాఠశాలకు పునాదులు వేశాం. - తాజున్నీసా, ఓర్వకల్లు

చదువు ప్రాముఖ్యత ఏమిటో మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మేం పొదుపులో చేరిన తర్వాత స్కూల్ ఆలోచన వచ్చింది. బాల కార్మికుల కోసం పెట్టిన పాఠశాల విజయవంతం కావడం వల్ల ఈ పాఠశాల ఏర్పాటు చేశాం. ఇప్పుడు మాకు చాలా గర్వంగా ఉంది. భవిష్యత్​లో యూనివర్సిటీ అవుతుందన్న నమ్మకం ఉంది. -విజయలక్ష్మి, ఓర్వకల్లు

మా స్కూల్ కార్పొరేట్ స్కూల్​ను తలపిస్తుంది. ఈ స్కూల్ మేమే కట్టించుకున్నాం అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. 27 గ్రామాల నుంచి 10వేల మంది మహిళలం సభ్యులుగా ఉన్నాం. ఈ స్కూల్ దగ్గరకు వస్తే తిరిగి వెళ్లాలనిపించదు. - రత్నమ్మ, లొద్దిపల్లి

మా చేతుల మీదుగా ఈ భవనాన్ని కట్టుకున్నాం. మేం ఇసుక మోశాం, ఇటుకలు మోశాం, కంకర మోసినం. రాళ్లు ఎత్తాం. ఈ భవనం మాకు దేవుని గుడి లాంటిది. మేం ఎలాగో చదువుకోలేదు. మా పిల్లలు అయినా బాగా చదువుకోవాలని స్కూల్ నిర్మించుకున్నాం. - లచ్చమ్మ, ఓర్వకల్లు

నా భర్త చనిపోవడంతో మాకు ఈ స్కూలే ఆధారమైంది. మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఫీజుల్లేవు, యూనిఫాం లేదు. ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదు. ఇది మాకు దేవాలయం లాంటిది. - ఈశ్వరమ్మ, బ్రాహ్మణపల్లి

మా పిల్లలు బాగా చదువుకోవాలన్నదే మా ఉద్దేశం. ప్రైవేటు పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించలేని మాలాంటి పేద కుటుంబాలకు వరం లాంటిది. ఇందులో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉంటుంది. -రాజేశ్వరి, లొద్దిపల్లి

ఈ స్కూల్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద స్కూల్​లో మా పిల్లలను ఇక్కడ చదివిస్తామని అనుకోలేదు. మా పిల్లలు ఫ్రీగా చదువుతున్నారు. నా భర్త చనిపోయినా మహిళా సంఘం నన్ను, మా పిల్లలను ఈ పాఠశాల ఆదుకున్నది. - హలీమాబీ, ఓర్వకల్లు

2017లో ఈ పాఠాశాల ప్రారంభమైంది. 31మంది క్వాలిఫైడ్ టీచర్లు పని చేస్తున్నారు. వారంతా ఎంతో నైపుణ్యం కలిగినవారు. ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రతిభ అవార్డు అందుకున్నాం. - క్లెమెంట్ సత్యబాబు, ప్రిన్సిపల్, బాలభారతి పాఠశాల

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.