అనుమానమే పెనుభూతమై భార్యను భర్త చంపిన సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం రామతీర్థంలో జరిగింది. గత కొన్నేళ్లుగా సుబ్బలక్ష్మమ్మపై అనుమానంతో... భర్త మద్దయ్య తరుచూ గొడవపడుతుండేవాడు. ఇవాళ ఇద్దరు మధ్య మాట మాట పెరిగింది. కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన భర్త... భార్యతలపై సుత్తితో మోదాడు. ఆమె చనిపోయిందని నిర్దరించుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న నందివర్గం పోలీసులు ఘటనస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి