కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి, తలపై రాయితో మోదాడు. అనంతరం తానూ గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. పట్టణంలోని తెలుగుపేటకు చెందిన బాలరాజు కత్తితో తన భార్య గొంతు కోసి తలపై బలంగా కొట్టాడు. అదే కత్తితో బాలరాజు గొంతు కోసుకున్నాడు. స్థానికులు వారిని నంధ్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబకలహాలతోనే ఈ విధంగా చేసినట్లు భర్త బాలరాజు తెలిపాడు.
ఇదీ చూడండి