ETV Bharat / state

నివాసయోగ్యం కాని స్థలాల మార్పుపై అధికారుల దృష్టి - పేదలకు ఇళ్ల స్థలాలు వార్తలు

నిరుపేదలకు ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఈ నెల 25న ముహుర్తం ఖరారు చేసింది. అయితే కర్నూలు జిల్లా ఆదోని-పత్తికొండ బైపాస్‌లో మొలకలకుంట సమీపంలో... కొందరికి పట్టాలిచ్చేందుకు లే-అవుట్‌ వేశారు. అధికారులు ఎంపిక చేసిన స్థలం అనువుగా లేదని, చినుకు పడితే చెరువును తలపిస్తోందని ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు.

house sites
ఎ.కోడూరు లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు
author img

By

Published : Dec 4, 2020, 5:31 PM IST

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 25వ తేదీన లబ్ధిదారులకు స్థలాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పేదలకు కేటాయించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవని ‘ఈనాడు’ పలు కథనాలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. క్షేత్రస్థాయిలో అలాంటి లే-అవుట్లను పరిశీలించి వాటిని మార్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఆదోని-పత్తికొండ బైపాస్‌లో మొలకలకుంట సమీపంలో కొందరికి పట్టాలిచ్చేందుకు లే-అవుట్‌ వేశారు. అధికారులు ఎంపిక చేసిన స్థలం అనువుగా లేదని, చినుకు పడితే చెరువును తలపిస్తోందని ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. ఆర్డీవో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వగా, వేరే స్థలం కేటాయించేందుకు నిర్ణయించారు. అలాగే ‘చెప్పినా చెవికెక్కలేదు’ అనే శీర్షికన సెప్టెంబర్‌లో వచ్చిన కథనంతో కర్నూలు డివిజన్‌ పరిధిలో రెండుమూడు లే-అవుట్లను మార్చి ప్రత్యామ్నాయంగా వేరే స్థలం కేటాయించేందుకు చూస్తున్నారు.

అవసరమైతే భూసేకరణకు వెళ్లేందుకు...

జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి 1,86,619 మంది లబ్ధిదారులను గుర్తించారు. అక్టోబర్‌-2న పంపిణీ చేయాలని నిర్ణయించినా, అమలు చేయలేకపోయారు. ఈ మధ్యలో అర్హులైన లబ్ధిదారులమంటూ 14 వేల దరఖాస్తులు అధికారులకు అందాయి. వాటిని పరిశీలించి అర్హులను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో రాజకీయ సిఫార్సులతో వచ్చినవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. లబ్ధిదారులను గుర్తించి ఇప్పటికే వేసిన లే-అవుట్లలో ఖాళీలను కేటాయించాలని ప్రణాళిక చేస్తున్నారు. ఒకవేళ భూమి సరిపోకపోతే...అవసరమైతే మరింత భూమి సేకరించేందుకు అడుగులు వేస్తున్నారు.

మరికొన్ని చోట్ల మార్చలేదు

జిల్లాలో మొత్తం లబ్ధిదారుల్లో టిడ్కో ఇళ్లు 29,066 మందికి పంపిణీ చేయనున్నారు. మిగిలిన 1,57,553 లబ్ధిదారుల కోసం 2,954 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. మరో 1,003 ఎకరాలు భూసేకరణ చేపట్టారు. ఇందులో ఆదోని, డోన్‌, కర్నూలు పరిధిలో ఎక్కువ ధరకు ఎకరా రూ.18 లక్షల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పి ఎక్కువ ధర ఇచ్చేలా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇంకా కొన్ని లే-అవుట్లు నివాస యోగ్యంగా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎస్సార్బీసీ కాల్వ పక్కన, నంద్యాల, బండిఆత్మకూరు, పాములపాడు, దేవనకొండ, డోన్‌ పరిధిలో లే-అవుట్లపై లబ్ధిదారులు అయిష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు.

రెవెన్యూకు బదలాయించిన భూమి

ఎస్సార్బీసీ భూసేకరణ చేసిన భూమిని రెవెన్యూకి బదలాయించింది. ప్రస్తుత జీవో ప్రకారం దానినే లబ్ధిదారులకు కేటాయిస్తున్నాం. నివాసయోగ్యం కాని భూములు గుర్తించి ప్రత్యామ్నాయ స్థలాలు చూశాం. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉంటే పట్టాలిస్తాం. - రాంసుందర్‌రెడ్డి, జేసీ

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లాలో.. నిర్లక్ష్యం నడుమ టిడ్కో గృహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.