ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో.. హైకోర్టు న్యాయవాది మృతి

High Court lawyer suspicious death : కర్నూలు జిల్లా నన్నూరు టోల్​గేట్ సమీపంలో పొలంలో మృతదేహం ఉన్నట్లు.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

died
died
author img

By

Published : Apr 10, 2022, 3:21 PM IST

High Court lawyer suspicious death : కర్నూలు సమీపంలోని నన్నూరు టోల్​గేట్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారమందించారు.

కర్నూలు నగరంలోని టెలికాం నగర్​లో న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన అదృశ్యమైనట్లు.. కుటుంబ సభ్యులు మహానంది పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నేడు నన్నూరు టోల్ గేటు సమీపంలోని పొలంలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఆరా తీశారు. మృతుడు వెంకటేశ్వర్లుగా గుర్తించి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Student Died: ఉన్నత చదువు కోసం వెళ్లి.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.