కర్నూలు జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షానికి పలు మండలాలు, గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. కర్నూలు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుందూ నది ఉద్ధృతంగా ప్రవహించటంతో సుమారు 150 ఎకరాల్లో పంట నీట మునిగింది. వాగులు, వంకలు చెరువులు నిండిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
మహానంది మండలం బుక్కాపురం గ్రామం వద్ద చెరువు నిండి రహదారిపై నీరు ప్రవహిస్తోంది. నంద్యాల నుంచి మహానంది వెళ్లే ఈ రహదారిలో ప్రయాణిస్తూ కొట్టుకుపోతున్న ద్విచక్రవాహనదారులను స్థానిక యువకులు రక్షించారు.
ఇవీ చదవండి..