కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. కర్నూలు, ఓర్వకల్లు, కొలిమిగుండ్ల, గోనెగండ్ల తదితర ప్రాంతాల్లో వానలు కురవటంతో... వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురవటంతో.. .బనవాసి వద్ద రహదారి కోతకు గురై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అదే విధంగా అల్వాల, గంజాహళ్లి వద్ద రహదారిపై వరదనీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవీ చదవండి: కరోనా భయం: మృతదేహాన్ని పూడుస్తుండగా అడ్డుకున్న ప్రజలు