కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. హాలహర్వి, కౌతాళం, పెద్దకడబూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, హొలగుంద, మంత్రాలయం, దేవనకొండ, చిప్పగిరి, అవుకు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆదోని పట్టణంలోని శంకర్ నగర్ లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. హాలహర్విలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో నిట్రవట్టి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. చాగలమర్రి మండలంలో భారీ వర్షాలకు 5 వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
ఇదీచూడండి.తరగతి గదుల్లో వర్షం.. వాననీటిలో చదువులు